ప్రజల్లో చైతన్యం రగిలించిన వందేమాతరం
స్టేషన్‌ఘన్‌పూర్: దేశస్వాతంత్య్ర ఉద్యమంలో వందేమాతర గేయం ప్రజల్లో ఉత్తేజాన్ని, చైతన్యాన్ని నింపిందని వందేమాతరం గేయాలాపన ప్రోగ్రాం రాష్ట్ర కన్వీనర్ నాగపురి రాజమౌళిగౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ అన్నారు. వందేమాతరం గేయాన్ని బంకించంద్రఛటర్జీ రచించి 150 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలో వందేమాతరం సామూహిక గేయాలాపన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. స్థానిక ప్రభు త్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థులతో కలిసి జాతీ య జెండాలను చేతబూని వందేమాతరం అంటూ నినాదాలు చేస్తూ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక శివాజీ చౌక్ వద్ద సామూహికంగా వందేమాతరం ఆలపించారు. మండల అధ్యక్షుడు సట్ల వెంకటరమణగౌడ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పార్లమెంట్ కోకన్వీనర్ ఇనుగాల యుగేందర్‌రెడ్డి, నాయకులు ఐలోని అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వందేమాతరం గేయాలాపన ప్రోగ్రాం రాష్ట్ర కన్వీనర్ నాగపురి రాజమౌళిగౌడ్


