బుధవారం శ్రీ 26 శ్రీ నవంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
జనగామ: రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్లు, పరిశీలన, ఉపసంహరణ, అభ్యర్థుల జాబితా, పోలింగ్ తేదీలు, ఓట్ల లెక్కింపు తదితర కార్యక్రమాల తేదీలు అధికారికంగా ప్రకటించారు. ఈసీ ప్రకటనతో గ్రామాలన్నీ ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్లిపోయాయి. జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అభివృద్ధి పనులకు బ్రేక్ పడనుంది.
మూడు దశల్లో పోలింగ్..
జిల్లాలో ఎలక్షన్లు మూడు దశల్లో జరగనున్నాయి. జిల్లాలోని 12 మండలాలు, 280 గ్రామ పంచాయతీలు, 2,534 వార్డులకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 11వ తేదీన తొలి విడత, 14వ తేదీన రెండో విడత, 17వ తేదీన మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి ఫేజ్ నామినేషన్ నవంబర్ 27, రెండో ఫేజ్ నామినేషన్ నవంబర్ 30, మూడో విడత నామినేషన్ డిసెంబర్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఎన్నికల ఒక దశ మరొక దశకు మధ్య 2 రోజుల వ్యవధి ఉండనుంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సమయం నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
బాధ్యతల కేటాయింపు..
ఎన్నికల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఏిపీఓలు, ఓపీఓలకు బాధ్యతలు కేటాయించారు. పోలింగ్ సెంటర్లు, సీసీ కెమెరాలు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, మోడల్ కోడ్ పర్యవేక్షణ బృందాలు ఇక రంగంలోకి దిగనున్నాయి.
పంచాయతీ ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డబ్బులు, బహుమతుల ద్వారా ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలను అరికట్టేందుకు ప్రత్యేక స్క్వాడ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రతీ పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలతో పకడ్బందీ పర్యవేక్షణ ఉండనుంది.
జిల్లాలో మూడు విడతల్లో ఎలక్షన్లు
280గ్రామ పంచాయతీలు, 2,534 వార్డులు..
అమలులోకి మోడల్ కోడ్
అభివృద్ధి పనులకు బ్రేక్
మూడు విడతల్లో ఎన్నికలు జరిగే మండలాల సమాచారం
ఫేజ్ మండలాలు జీపీలు వార్డులు
ఫేజ్–1 చిల్పూరు, స్టేషన్‌ఘన్‌పూర్, 110 1,024
రఘునాథపల్లి, జఫర్‌గడ్,
లింగాలఘణపురం
ఫేజ్–2 జనగామ, నర్మెట,
తరిగొప్పుల, బచ్చన్నపేట 79 710
ఫేజ్–3 దేవరుప్పుల, పాలకుర్తి, 91 800
కొడకండ్ల
బుధవారం శ్రీ 26 శ్రీ నవంబర్ శ్రీ 2025
బుధవారం శ్రీ 26 శ్రీ నవంబర్ శ్రీ 2025


