మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ రూరల్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించి అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో జనగామ పట్టణం, జనగామ, నర్మెట, తరిగొప్పుల, బచ్చన్నపేట మండలాలకు చెందిన మహిళా స్వయం సహాయక సంఘాలకు డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో వడ్డిలేని రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. వడ్డీలేని రుణాల పథకం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, డీఆర్‌డీఏ వసంత, మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.


