టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి
జనగామ రూరల్: విద్యాహక్కు చట్టం అమలుకు ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..టెట్‌పై సుప్రీంకోర్టు తీర్పు వచ్చి రెండు నెలలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రివ్యూ పిటిషన్ వేయలేదని, కనీసం డిసెంబర్ 1 నుంచి జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనైనా చట్టాన్ని సవరించి సీనియర్ ఉపాధ్యాయుల ఉద్యోగాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రంజిత్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి మడూరి వెంకటేష్, ఆకుల శ్రీనివాసరావు, కోశాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


