మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి
● ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
పాలకుర్తి టౌన్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో మండలంలోని స్వయం సహాయక సంఘాలకు రూ.6.73 కోట్లు వడ్డీరహిత రుణాల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. అలాగే ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం, సమాజం, రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకుసాగుతాయన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిర మహిళా శక్తి టీ పాయింట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ వసంత, ఏపీడీ నూరుద్దీన్, తహసీల్దార్ సరస్వతి, ఎండీపీఓ వేదావతి తదితరులు పాల్గొన్నారు.


