వడ్డీలేని రుణాలు విడుదల
జనగామ: జిల్లాలో 2023 డిసెంబర్ నుంచి 2025 జూలై వరకు స్వయం సహాయ సంఘాలకు భారీగా వడ్డీ లేని రుణాలు అందిస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు అనుబంధంగా ఉన్న సెర్ప్ ద్వారా సంఘాలకు ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, యశస్వినిరెడ్డి, ఎంపీలు కావ్య, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతిధుల చేతుల మీదుగా పంపిణీ చేస్తున్నారు. మొత్తంగా నాలుగు విడతల్లో జిల్లాకు 9,216 సంఘాలకు రూ.30.53 కోట్లు విడుదల చేశారు.
నియోజకవర్గాల వారీగా..
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో 4,248 సంఘాలకు రూ.14.91 కోట్లు విడుదలయ్యాయి. చిల్పూర్, స్టేషన్‌ఘన్‌పూర్, లింగాలఘణపురం, రఘునాథపల్లి, జఫర్‌గఢ్ మండలాల స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నారు. జనగామ నియోజకవర్గంలో 2,558 సంఘాలకు రూ.8.89 కోట్లు మంజూరు చేశారు. రుణాలకు సంబంధించిన నిధులను బచ్చన్నపేట, జనగామ, నర్మెట, తరిగొప్పుల మండలాలకు కేటాయించారు. పాలకుర్తి పరిధిలో 2,410 సంఘాలకు రూ.6.73 కోట్లు రుణాలు మంజూరు కాగా, దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి మండలాల పరిధిలోని సంఘాలు లబ్ధి పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సంఘాల ఆర్థిక స్థిరీకరణ కోసం ప్రభుత్వం వడ్డీలేని రుణాలను అందజేస్తోందని అధికారులు చెప్పారు.
జిల్లాలోని 9,216 సంఘాలకు రూ.30.53కోట్లు
పండగలా సాగుతున్న పంపిణీ


