బాయికాడ బందోబస్తు
నిఘానీడలో వ్యవసాయ క్షేత్రాలు, డెయిరీ ఫామ్స్
లింగాలఘణపురం/పాలకుర్తిటౌన్: టెక్నాలజీ సులభతరమై సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాలు, డెయిరీ ఫామ్‌లు సైతం నిరంతరం నిఘా నీడలో ఉంటున్నాయి. తక్కువ ఖర్చుతో అన్నదాతలు తమ వ్యవసాయ బావుల వద్ద ఏం జరుగుతుందనే విషయాలను తెలుసుకుంటూ ప్రశాంతంగా ఉంటున్నారు. బావుల వద్ద దొంగల బెడద, పాడిపశువులు, వ్యవసాయ పరికరాల చోరీ, లేగదూడలపై కుక్కల దాడి, పశువులు ఈనె సమయంలో రాత్రింబవళ్లు అక్కడే ఉండకుండా ఫోన్‌లో చూసుకుంటూ, ఏదైనా అనుకోని ఘటనతో జరిగితే తక్షణమే బావు ల వద్దకు వెళ్లి సమస్య పరిష్కారం చేసుకుంటు న్నారు. అలాగే జీతగాళ్లు వ్యవసాయ బావుల వద్ద ఉన్నారా లేదా.. రాత్రివేళల్లో ఎవరు వస్తున్నారు.. ఎటుపోతున్నారనే విషయాలను తెలుసుకొనేందుకు సోలార్ సీసీ కెమెరాలను ఏర్పా టు చేసుకొని ఫోన్‌లో చూసుకుంటూ పర్యవేక్షించుకుంటున్నారు.
నిరక్షరాస్యులు సైతం ఆపరేట్ చేసేలా..
నిరక్షరాస్యులు సైతం తక్కువ ఖర్చుతో సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని ఆపరేట్ చేసుకొనే అవకాశం వచ్చింది. ఉన్నచోటు నుంచి బావి వద్ద ఉన్న సీసీ కెమెరాలో అక్కడి వ్యక్తితో మాట్లాడుకోవచ్చు. ఇలా రూ.6,700ల నుంచి స్థోమతను బట్టి రైతులు బావుల వద్ద సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవచ్చు. గతంలో మాది రిగా సీసీ కెమెరాలకు కేబుల్ అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే ఫోన్ మాదిరిగా పని చేస్తుంది. ఆయా ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ను బట్టి సిమ్‌ను ఉపయోగించుకొని రీచార్జ్ చేసుకుంటే సరిపోతుంది. బావులు, డెయిరీ ఫామ్‌ల వద్దకు ఎవరైనా వస్తే వెంటనే ఫోన్‌కు అలెర్ట్ మెసేజ్ వస్తుంది. దీంతో రైతు ఎక్కడున్న ఫోన్‌లోనే చూసుకొని స్పందించవచ్చు. దొంగలు వచ్చిన, పశువులు ఈనినా, కోళ్ల దొంగతనం జరిగినా ఇలా ఏ విషయంలోనైనా చర్యలు తీసుకొని రైతులు హాయిగా ఉంటున్నారు. కెమెరాకు సంబంధించిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకుంటే రెండు, మూడు ఫోన్‌లకు లింక్ చేసుకోవచ్చు. మెమొరీ కార్డు ర్యామ్‌ను బట్టి వారం నుంచి నెల రో జుల పాటు రికార్డింగ్ అందుబాటులో ఉంటుంది.
పలు గ్రామాల్లో సొలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు
చీమ చిటుక్కుమన్నా ఫోన్‌లో అలెర్ట్
రైతన్నకూ చేరువైన అధునాతన టెక్నాలజీ
బాయికాడ బందోబస్తు
బాయికాడ బందోబస్తు
బాయికాడ బందోబస్తు


