పాడిపశువును కాపాడుకున్నా..
బావి వద్ద డెయిరీఫామ్, గొర్రెల ను పెంచుకుంటున్నా. రూ. 6,700లతో ఆన్‌లైన్‌లో సోలార్ సీసీ కెమెరాలను ఏర్పా టు చేసుకున్నా.. నెలకు రూ.300లు రీచార్జ్ చేసుకొని అక్కడ జరిగే ప్రతి అంశం ఫోన్‌లో రికార్డు అవుతుండగా చూసుకుంటున్నా.. ఒక రోజు పాడి ఆవు దాణా కోసం కట్టేసిన చోటు నుంచి ముందుకు వచ్చి ఎటూ వెళ్లలేక ఇబ్బంది పడుతుండగా ఫోన్‌లో చూసుకొని వెంటనే వచ్చి కాపాడుకున్నా. గొర్రెల దొడ్డి చుట్టూ రాత్రివేళల్లో కుక్కల మంద తిరుగుతుండగా చూసుకొని ఇంట్లోనే ఉండి వెంటనే ఫోన్‌లో అరవగా కుక్కలు పారిపోయాయి.
– నకీర్త మల్లేశం, పాడి రైతు, కళ్లెం


