ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నా..
వ్యవసాయ బావుల వద్ద తరుచుగా జరుగుతున్న చిన్నచిన్న దొంగతనాలను ఎలా అరికట్టాలని ఆన్‌లైన్‌లో చూసి యూట్యూబ్‌లో అగ్రికల్చర్ సీసీ కెమెరా గురించి తెలుసుకున్నా.. రూ.8,500లకు సోలార్ సీసీ కెమెరాను కొనుగోలు చేశా. డెయిరీ ఫామ్‌లో రేకులపై సోలార్ ప్యానల్ ఏర్పాటు చేశా.. కెమెరా దొడ్లో పెట్టా. ఎవరొచ్చినా సుమారు 15 నుంచి 30 మీటర్ల దూరంలో ఉండగానే నేను ఎక్కడున్న ఫోన్‌కు మెసేజ్ వచ్చి అలెర్ట్ చేస్తుంది. దీంతో ఫోన్ చూసుకొని ఏం జరుగుతుందనే విషయాలను ఫోన్‌లోనే చూసుకుంటున్నా.. – బోయిని సంతోష్,
పాడి రైతు, లింగాలఘణపురం


