దొంగల బెడద తప్పింది
గతంలో పొలం పనుల చేసి అలసిపోయి వ్యవసాయ పరికరాలు బావి దగ్గరే వదిలేసి ఇంటికి వెళ్లేవాళ్లం. అయితే దొంగలు మోటార్లు, స్టార్టర్లు, పశువులు, గొర్రెలు, కోళ్లను ఎత్తుకెళ్లేవారు. పంట పొలంలో ఉన్న ట్రాన్స్‌పార్మర్‌లోని కాపర్ వైరు ఎత్తుకెళ్లారు. దీంతో పలువురం రైతులం వ్యవసాయ భూమి హద్దులకు నాలుగు దిక్కుల నాలుగు సీసీ కెమెరాలను కర్రల సహాయంతో ఏర్పాటు చేసుకున్నాం. సీసీ కెమెరాల సాయంతో నా పొలం చుట్టు ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు నా ఫోన్ లోనే చూసుకుంటున్నా. – నారబోయిన పవన్‌కుమార్,
రైతు, వావిలాల, పాలకుర్తి మండలం


