భక్తుల సౌకర్యార్థం రేకుల షెడ్డు నిర్మాణం
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఘాట్ రోడ్డు మార్గంలో భక్తుల సౌకర్యార్థం ఓ భక్తుడు రూ.5లక్షల వ్యయంతో సోమవారం నిర్మాణ పనులు ప్రారంభించినట్లు ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న తెలిపారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి గ్రామానికి చెందిన భక్తుడు వంగ సోమిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులు ఘాట్ రోడ్డు మార్గంలో ప్రయాణించే భక్తులకు ఎండా కాలం, వర్షాకాలం ఇబ్బందులు కలగకుండా ఘాట్ రోడ్డు మార్గంలో రూ. 5 లక్షల వ్యయంతో రేకుల షెడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
మాతృమరణాలు జరగకుండా చూసుకోవాలి
జనగామ రూరల్: మాతృ మరణాలు జరగకుండా చూసుకోవాలని డీఎంహెచ్‌ఓ మల్లికార్జునరావు అన్నారు. సోమవారం పట్టణంలోని ఎంసీహెచ్‌లో ఇప్పగూడెం, నర్మెట, తరిగొప్పుల పలు పీహెచ్‌సీల్లో మాతృ మరణాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..మాతృ మరణాల ఘటనలు పునరావృతం కాకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అంతేకాక నాణ్యమైన గర్భధారణ పూర్వసేవలు అందించడం, హైరిస్క్ ప్రెగ్నెన్సీలను ముందస్తుగా గుర్తించాలన్నారు. అనంతరం పట్టణంలోని ఏఎన్‌ఎంలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యులు కమల్ హాసన్, శ్రీతేజ, అనురాధ జాదవ్, శ్రీదేవి,అశోక్, మనస్విని, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు సింధు
రఘునాథపల్లి: మండలంలోని కుర్చపల్లి గ్రామానికి చెందిన తోకల సింధు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభ చాటి జాతీయ స్థాయి జట్టుకు ఎంపికై నట్లు మండలంలోని గోవర్ధనగిరి గ్రామానికి చెందిన జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, ఎన్‌ఐహెచ్ కబడ్డీ కోచ్ తోటకూరి గట్టయ్య తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ మియాపూర్ బాచుపల్లిలో సోమవారం జరిగిన అండర్–16 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో సింధు ప్రతిభ చాటి జాతీయ స్థాయి కబడ్డీ జట్టుకు ఎంపికై నట్లు పేర్కొన్నారు.
ఉపాధ్యాయులకు శిక్షణ
జనగామ రూరల్: విద్యార్థులకు నైతిక విలువలు, పాజిటివ్ లెర్నింగ్, వ్యక్తిత్వ వికాసం, సామాజి కాభివృద్ధి, ఆరోగ్యం, రక్షణ, నాయకత్వ ప్రస్థానం, సేవా దృక్పథం తదితర బోధనాంశాలపై ఉపాధ్యాయులు పట్టు సాధించాలని లయన్స్ క్వెస్ట్ మాస్టర్ ట్రైనర్ లయన్ కొండపల్లి రేణుక, కానుగంటి సుభాశ్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏకశిల బీఈడీ కళాశాలలో రెండు రోజుల పాటు ఉపాధ్యాయ శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ లయన్ రామిని శ్రీనివాసులు, కారంపూడి సత్య నారాయణ, సుదగాని ప్రవీణ్, కె.రాజశేఖర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ మర్రెడ్డి పాల్గొన్నారు.
భక్తుల సౌకర్యార్థం రేకుల షెడ్డు నిర్మాణం
భక్తుల సౌకర్యార్థం రేకుల షెడ్డు నిర్మాణం


