దేశాన్ని ఐక్యం చేసింది వందేమాతరమే
● బీజేపీ రాష్ట్ర నాయకుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి
జనగామ రూరల్: దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో వందేమాతర గీతం ప్రజలను ఐక్యం చేసిందని బీజేపీ రాష్ట్ర నాయకుడు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి అన్నారు. వందేమాతర గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ ఆధ్వర్యంలో స్థానిక నెహ్రూ పార్క్ నుంచి రైల్వే స్టేషన్ వరకు పెద్దఎత్తున జాతీయ జెండాలు చేత పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. స్వతంత్ర సంగ్రామంలో వందేమాతర గేయం భారతీయులను ఉత్తేజపర్చిందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఆరుట్ల దశమంతరెడ్డి, కేవీఎల్ రెడ్డి, బుడుగుల రమేశ్, మహంకాళి హరిశ్చంద్రగుప్తా, డాక్టర్ భిక్షపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి భాగాల నవీన్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు బొమ్మకంటి అనిల్, సీనియర్ నాయకులు అంకుగారి శశిధర్‌రెడ్డి, బీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు శివకృష్ణ, హరి ప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు.
దేశాన్ని ఐక్యం చేసింది వందేమాతరమే


