సర్పంచ్‌ ఎన్నిక ఏకగ్రీవమైతే రూ.25లక్షలు | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ ఎన్నిక ఏకగ్రీవమైతే రూ.25లక్షలు

Nov 25 2025 10:18 AM | Updated on Nov 25 2025 10:18 AM

సర్పంచ్‌ ఎన్నిక ఏకగ్రీవమైతే రూ.25లక్షలు

సర్పంచ్‌ ఎన్నిక ఏకగ్రీవమైతే రూ.25లక్షలు

స్టేషన్‌ఘన్‌పూర్‌: పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవం చేస్తే నజరానాగా రూ.10 లక్షలు, సర్పంచ్‌ ఎన్నికను ఏకగ్రీవం చేస్తే రూ.25 లక్షలు నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాన్ని ఘన్‌పూర్‌ డివిజన్‌ కేంద్రంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కడియం మాట్లాడారు.. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ సర్పంచ్‌ అభ్యర్థుల ఎంపిక గ్రామ కమిటీలు, మండల కమిటీలదేనని అన్నారు. ఈనెల 26వ తేదీవరకు ప్రతీ గ్రామం నుంచి ఇద్దరు, ముగ్గురు పేర్లతో అభ్యర్థుల ప్రతిపాదనలు అందించాలని గ్రామ కమిటీలు, మండల కమిటీలను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మారుడోజు రాంబాబు, ఏఎంసీ చైర్మన్‌ లావణ్యశిరీష్‌రెడ్డి, చిల్పూరు దేవస్థాన చైర్మన్‌ శ్రీధర్‌రావు, నాయకులు బెలిదె వెంకన్న, నూకల ఐలయ్య, కట్టా మనోజ్‌రెడ్డి, అన్నం బ్రహ్మారెడ్డి, క్రాంతి, కొలిపాక సతీష్‌, వెంకటేశ్వర్‌రెడ్డి, బూర్ల శంకర్‌, వెంకటయ్య, ఇంద్రారెడ్డి, పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement