ఎంపీడీఓ సంఘం జిల్లా కమిటీ ఎన్నిక
జనగామ రూరల్: తెలంగాణ మండల పరిషత్ అభివృద్ధి అధికారుల సంఘం జిల్లా ఎన్నికలు సోమవారం జరిగాయి. ఎన్నికల అధికారిగా జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య నిర్వహణాధికారి మాధురి కిరణ్ చంద్ర షా వ్యవహరించారు. ఈసందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా కొడకండ్ల ఎంపీడీఓ పి.ఎం.ఎస్.సూరి, ప్రధాన కార్యదర్శిగా జి.మమత(ఎంపీడీఓ బచ్చన్నపేట), ట్రెజరర్‌గా వేదవతి (ఎంపీడీఓ, పాలకుర్తి), వైస్ ప్రెసిడెంట్ జి.శ్రీనివాసులు (ఎంపీడీఓ, రఘునాథపల్లి), ఆర్గనైజింగ్ సెక్రెటరీ బి.మహేశ్‌నాయక్ (ఎంపీడీఓ, జనగామ), అసోసియేట్ ప్రెసిడెంట్ శివశంకర్‌రెడ్డి (ఎంపీడీఓ లింగాల ఘనపూర్), కార్యనిర్వాహక సభ్యులుగా శంకర్ నాయక్ (ఎంపీడీఓ చిల్పూర్), కావ్య శ్రీనివాస్ ఎంపీడీఓ నర్మెట లావణ్య (ఎంపీడీఓ తరిగొప్పుల), మేనక (ఎంపీడీవో దేవరుప్పుల) ఎన్నికయ్యారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌ను, అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.


