ఘనంగా కొత్తపల్లి ఉర్సు
స్టేషన్‌ఘన్‌పూర్: మండలంలోని కొత్తపల్లి గ్రామంలో దర్గా హజరత్ సయ్యద్ మీరా మొహియుద్దీన్‌షా ఖాద్రి రహమతుల్లా అలై ఉర్సు ఉత్సవాలను గ్రామ దర్గా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు ఉత్సవాలను ప్రారంభించగా ఏసీపీ భీమ్‌శర్మ, సీఐ జి.వేణు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉర్సు ప్రార్థనల్లో అనంతరం సందల్ ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో ఎస్.రాజేశ్, మాజీ సర్పంచ్ బూరు నరేందర్, దర్గా కమిటీ బాధ్యులు షౌకత్, అజ్జు, అన్వర్‌బేగ్, అమ్జద్, ఇమ్రాన్, రహీమ్, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.


