వందేళ్ల ఉత్సవాన్ని విజయవంతం చేయాలి
● సీపీఐ జిల్లా కార్యదర్శి
సీహెచ్.రాజారెడ్డి
లింగాలఘణపురం: సీపీఐ వందేళ్ల శత వార్షికోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే ఉత్సవాలను విజయవంతం చేయాలని సీపీఐ జనగామ జిల్లా కార్యదర్శి సీహెచ్.రాజారెడ్డి కోరారు. సీపీఐ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 15న మొదలైన శత ఉత్సవాల ప్రచార జాత ఆదివారం మండలంలోని నెల్లుట్లకు చేరుకుంది. ఈ సందర్భంగా మండల కార్యదర్శి సదానందం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజారెడ్డి మాట్లాడుతూ.. 1925లో దేశంలో ఏర్పాటైన సీపీఐ స్వాతంత్రోద్యమంలో కీలకపాత్ర పోషించిందన్నారు. ప్రచార జాతలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లాఖాద్రి, జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్య పద్మ, నాయకులు నరేంద్ర ప్రసాద్, ఉప్పలయ్య, సాయ్య, సోమయ్య, సుగుణమ్మ, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమాలే ఏకై క మార్గం..
దేవరుప్పుల: ప్రజాసమస్యల పరిష్కారం కోసం పాలకులపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమాలే ఏకై క మార్గమని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, సీపీఐ జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి అన్నారు. సీపీఐ మండల కార్యదర్శి జీడీ ఎల్లయ్య ఆధ్వర్యంలో ప్రచార జాతా కడవెండి దొడ్డి కొమురయ్య, కామారెడ్డిగూడెం షెక్ బందగీ, దేవరుప్పులలో అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకోగా అమరులకు ఘన నివాళులు అర్పించారు.


