కలం గళమై చైతన్యం రగిలించిన అందెశ్రీ
● తెలంగాణ రచయితల వేదిక
రాష్ట్ర కార్యదర్శి జోగు అంజయ్య
జనగామ రూరల్: తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో కలం గళంతో ప్రజల్లో చైతన్యం రగిలించిన తెలంగాణ నిప్పుల వాగై ఉప్పొంగిన లోక కవి అందెశ్రీ అని తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర కార్యదర్శి జోగు అంజయ్య కొనియాడారు. ఆదివారం పట్టణంలోని గబ్బెట గోపాల్‌రెడ్డి భవన్‌లో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో డాక్టర్ అందెశ్రీ సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంజయ్య పాల్గొని అందెశ్రీకి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. పశువుల కాపరి నుంచి జీవితాన్ని ప్రారంభించి స్వయం కృషితో కలాన్ని చేతబట్టి గళాన్ని విప్పిన గొప్ప వాగ్గేయకారుడు అందెశ్రీ అన్నారు. అందెశ్రీ మరణం సాహితి ప్రపంచానికి తీరని లోటని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సాహితి సాంబరాజు యాదగిరి, కవులు కళాకారుల ఐక్యవేదిక, జి.వై.గిరి ఫౌండేషన్ జి.కృష్ణ, జనగామ రచయితల సంఘం నక్క సురేష్, కవి హృదయం సాహిత్య వేదిక పెట్లోజు సోమేశ్వరాచారి, అభినందన కల్చరల్ సొసైటీ అయిలా సోమనర్సింహచారి, పోతన సాహిత్య వేదిక మాన్యపు భుజేందర్, కవులు కొలిపాక బాలయ్య, మసురం రాజేంద్రప్రసాద్, వసంత, అంకాల సోమయ్య, కానుగంటి వెంకటేశం, చీటూరు నర్సింహులు, గాదరి సుధాకర్, గూటం రమేష్, చాపల మహేందర్, మామిండ్ల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.


