నేటి ప్రజావాణి రద్దు
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ రూరల్: ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధ ప్రక్రియతో పాటు స్వయం సహాయక సభ్యులకు చీరల పంపిణీ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు విధి నిర్వహణలో ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్టు కలెక్టర్ చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి కలెక్టరేట్‌కు ఎవరూ రాకూడదని, సహకరించాలని కలెక్టర్ కోరారు.
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక
లింగాలఘణపురం: మండలంలోని వనపర్తి ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని కాళీ మౌనిక రాష్ట్రస్థాయి జూనియర్ వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు ఎంఈఓ విష్ణుమూర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం హన్మకొండలో జేఎన్‌ఎస్‌లో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ చాంపియన్‌షిప్‌లో భాగంగా నిర్వహించిన పోటీల్లో మౌనిక ఉత్తమ ప్రదర్శన కనబరిచి ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు చెప్పారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యేలా తీర్చిదిద్దిన వ్యాయామ ఉపాధ్యాయుడు పూజారి కుమార్‌ను, ఎంపికై న విద్యార్థిని మౌనికను ఉపాధ్యా య బృందం, గ్రామస్తులు అభినందించారు.
రాష్ట్రస్థాయిలో ఉజ్వలకు ప్రథమ బహుమతి
లింగాలఘణపురం: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ పదో తరగతి విద్యార్థిని బి.ఉజ్వలకు వచన కవితల విభాగంలో రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి లభించినట్లు ఎంఈఓ విష్ణుమూర్తి, ప్రిన్సిపాల్ సునిత తెలిపారు. ఈ నెల 14న జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్ వారు నిర్వహించిన వచన కవిత విభాగంలో బహుమతులు పొందిన వారికి ఆదివారం హైదరాబాద్‌లో బహుమతి ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతా బయోటెక్, శాంతా వసంత్ ట్రస్టు సంయుక్తంగా నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవంలో వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కె.ఐ.వరప్రసాద్, మాజీ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి చేతుల మీదుగా రూ.2వేల నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం అందుకుంది. ఈ సందర్భంగా విద్యార్థిని ఉజ్వలను ఉపాధ్యాయులు అభినందించారు.
ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు
14 మంది గైర్హాజరు
జనగామ రూరల్: జాతీయస్థాయి ఎన్‌ఎంఎంఎస్(నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీం) ప్రవేశ పరీక్షకు 14 మంది గైర్హాజరయ్యారని ప్రభుత్వ పరీక్షల సహాయ సంచాలకుడు టి. రవికుమార్ తెలిపారు. ఆదివారం ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ఎలాంటి సమస్యలు లేకుండా ముగిసిందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 4 పరీక్షా కేంద్రాల్లో 728 మంది విద్యార్థులకు గానూ 714 మంది హాజరు కాగా 14 మంది పరీక్షకు గైర్హాజరయ్యారని, 98.08 శాతంగా హాజరు నమోదైందని తెలిపారు.
వనదేవతలకు మొక్కులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం వేలాదిగా తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు జంపన్నవాగులో స్నానాలు ఆచరించి వనదేవతల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఒడిబియ్య, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల వద్ద పూజలు నిర్వహించారు. మొక్కుల అనంతరం మేడారం పరిసరాల ప్రాంతాల్లో వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేసి సందడి చేశారు.
నేటి ప్రజావాణి రద్దు
నేటి ప్రజావాణి రద్దు


