మహిళా సంక్షేమానికి పెద్దపీట
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి
● ఘన్‌పూర్‌లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ
స్టేషన్‌ఘన్‌పూర్: సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కొనియాడారు. ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలో నియోజకవర్గంలోని జనగామ జిల్లాలోని ఐదు మండలాలకు చెందిన మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఆర్‌డీఓ డీఎస్ వెంకన్న అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడారు.. కోటి మంది మహిళలకు కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరీలో, నిర్మాణంలో జనగామ జిల్లాలో ఘన్‌పూర్ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని, ప్రజలందరి ఆశీర్వాదంతో నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ది చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు.
గత ప్రభుత్వం ఇచ్చిన చీరలు దిష్టిబొమ్మలకు కట్టారు: ఎంపీ కావ్య
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మహిళలకు ఇచ్చిన చీరలు నాణ్యత లేకుండా ఉండేవని, పొలాల్లో దిష్టిబొమ్మలకు కట్టేవారని ఎంపీ కడియం కావ్య ఆరోపించారు. కార్యక్రమంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ రాంబాబు, డీఆర్‌డీఓ వసంత, డీపీఎం సతీశ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు బెలిదె వెంకన్న, ఏఏంసీ చైర్‌పర్సన్ లావణ్యశిరీష్‌రెడ్డి, వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, ఏపీఎంలు ప్రసాద్, పిట్టల నరేందర్, కె.కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.


