అంతరాయమొస్తే అలెర్ట్ చేస్తుంది!
విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన చోటు గుర్తించి తక్షణమే మరమ్మతులు చేసేందుకు సహాయపడే యంత్రాన్ని(సిస్టమ్)ను పైలట్ ప్రాజెక్ట్‌గా మండలంలోని నర్సాపూర్ గ్రామంలో విద్యుత్‌శాఖ ఇటీవల ఏర్పాటు చేసింది. గ్రామంలో ఒక విద్యుత్ పోల్‌కు సోలార్ విద్యుత్ ద్వారా నడిచే ఈ పవర్ ఇంట్రప్షన్ పరికరాన్ని ఏర్పాటు చేసి గ్రామానికి విద్యుత్ సరఫరా అయ్యే కేబుల్స్‌కు మూడు పరికరాలను అమర్చారు. దీంతో ఏఏ ప్రాంతంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందనేది గుర్తించే వీలుంటుంది. తద్వారా తక్షణ మరమ్మతులు చేసే అవకాశం ఉంటుందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. – తరిగొప్పుల


