జిల్లాలో మూడు విడతలుగా జరిగే మండలాలు
జనగామ: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైంది. ప్రభుత్వం తాజా మార్గదర్శకాల మేరకు ఈసారి ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గతంలో రెండు విడతల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తికాగా, ఇప్పుడు కొత్త గైడ్‌లైన్స్ కారణంగా ఒక విడతను అదనంగా జోడించారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి కేంద్రీకరిస్తోంది. జిల్లా పరి ధిలో 12 మండలాలు ఉండగా, ప్రతీ విడతలో నాలుగు మండలాల చొప్పున పోలింగ్ చేపట్టేందుకు పంచాయతీ శాఖపై కసరత్తు మొదలుపెట్టింది. రాబోయే నాలుగైదు రోజుల్లో అధికారిక నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండడంతో ఎన్నికల వేడి రాజుకోనుంది.
డ్రాఫ్ట్ రూపంలో రిజర్వేషన్ల తయారు..
ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్ల విషయానికి వస్తే, జిల్లా అధికారులు ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలకు 50 శాతం, మిగతా జనరల్ కేటగిరీ, మహిళలకు సంబంధించిన రిజర్వేషన్లను డ్రాఫ్ట్ రూపంలో సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అధికారిక గెజిట్ విడుదలైన వెంటనే ఫైనల్ రిజర్వేషన్లను ప్రకటించనున్నారు. జిల్లాలో 4,11,000 మంది ఓటర్లు ఉండగా, ఇందులో తమ పేర్లు ఓటర్ జాబితాలో ఉన్నాయో తెలుసుకునేందుకు 23వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఇప్పటికే గ్రామ సచివాలయాల వద్ద ఓటర్ నమోదు, మొబైల్ నెంబర్ లింక్, తప్పుల సవరణ ప్రక్రియలతో బిజీబిజీగా మారిపోయింది.
మూడో విడత పోటీదారులకు
పెరగనున్న ఖర్చు
మూడు విడతల్లో ఎన్నికలు జరగనుండడంతో అభ్యర్థుల ఖర్చు కూడా పెరగనుంది. జిల్లాలో 280 గ్రామ పంచాయతీలు ఉండగా, 2,534 వార్డులు ఉన్నాయి. ఇందులో 4 మండలాల చొప్పున విభజించి మూడు విడతల్లో ఎలక్షన్లను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి విడతలో 74 జీపీలు, 668 వార్డులు, రెండో విడతలో 117 జీపీలు, 1,038 వార్డులు, మూడో విడతలో 89 జీపీలు, 828 వార్డుల పరిధిలో ఎన్నికలను నిర్వహించనున్నారు. ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారం మూడు విడతల షెడ్యూల్‌ను తయారు చేస్తుండగా, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మొదటి విడత అభ్యర్థులకు ఖర్చులు కొంత తగ్గే అవకాశం ఉండగా, రెండో విడతలో 30 శాతం వరకు అదనపు భారం పడనుంది. ఇక మూడో విడత అభ్యర్థులకు మాత్రం ఖర్చు భారీగా పెరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎన్నికల తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ మొదటి విడత అభ్యర్థులు స్వల్పకాలం ప్రచారంతోనే సరిపెట్టుకునే అవకాశం ఉంది.
ఫేజ్ మండలాలు జీపీ వార్డులు
ఫేజ్–1 జనగామ,
లింగాలఘణపురం,
నర్మెట, తరిగొప్పుల 74 668
ఫేజ్–2 బచ్చన్నపేట, దేవరుప్పుల,
పాలకుర్తి, కొడకండ్ల 117 1,038
ఫేజ్–3 చిల్పూరు, స్టేషన్‌ఘన్‌పూర్,
రఘునాథపల్లి, జఫర్‌గఢ్ 89 828
ఓటరు జాబితా పరిశీలనకు
23 వరకు అవకాశం
12 మండలాలు..
మూడు విడతలుగా విభజన
మూడో విడత ఎన్నికల పోటీదారులకు పెరగనున్న ఖర్చు
జిల్లాలో మూడు విడతలుగా జరిగే మండలాలు


