పథకాల అమలులో మీడియాది ప్రధానపాత్ర
జనగామ రూరల్: ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు ప్రతీ నిరుపేదకు అందించే ప్రక్రియలో మీడియా రంగానిది ప్రధాన పాత్ర అని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కొనియాడారు. వివిధ అంశాల్లో కేంద్ర, రాష్ట్ర స్థాయిలో అవార్డులు వచ్చిన నేపథ్యంలో శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫ రెన్స్ హాల్‌లో మీడియా ప్రతినిధులకు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జల సంచయ్ జన భగీదారి కార్యక్రమంలో భాగంగా జాతీయ స్థాయిలో జిల్లాకు అవార్డు వచ్చిన సందర్బంగా క్షేత్రస్థాయిలో కృషి చేసిన వివిధ శాఖల అధికారులకు అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, డీసీపీ రాజామహేంద్ర నాయక్, ఆర్డీఓ వెంకన్న, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని తదితరులు పాల్గొన్నారు.
జనగామ: మొబైల్ ఫోన్ల రికవరీలో జిల్లా పోలీసుల సేవలు భేషుగ్గా ఉన్నాయని వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ కితాబిచ్చారు. శుక్రవారం జనగామ ఏసీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారికి డీసీపీ అప్పగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. జనగామ పోలీస్ స్టేషన్ పరిధిలో 20, నర్మెట 1, బచ్చన్నపేట 2, తరిగొప్పుల 2, స్టేషన్‌ఘన్‌పూర్ 2, చిల్పూరు 4, రఘునాథపల్లి 1, వర్ధన్నపేట 5, రాయపర్తి 3, పాలకుర్తి 2, కొడకండ్ల 4, దేవరుప్పుల 4 ఫోన్లు ఉండగా, డీసీపీ చేతుల మీదుగా యజమానులకు అందించారు. ఏసీపీ భీంశర్మ, సీఐలు సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సైలు పాల్గొన్నారు.
జనగామ రూరల్: నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్‌లో ఖాళీగా ఉన్న (7) ఎంఎల్‌హెచ్‌సీ(మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్) పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి కె.మల్లికార్జున రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 24 నుంచి 29 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. అభ్యర్థులు https:// jangaon. telangana. gov. in వెబ్‌సై ట్ నుంచి దరఖాస్తు పత్రాలను డౌన్ లోడ్ చేసుకోవాలన్నా రు. ఎంబీబీఎస్ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యముంటుందన్నారు.
పథకాల అమలులో మీడియాది ప్రధానపాత్ర


