భక్తిశ్రద్ధలతో పోలిపాడ్యమి దీపారాధన
జనగామ: కార్తీక మాసం ముగింపు సందర్భంగా జిల్లావ్యాప్తంగా పోలిస్వర్గం పాడ్యమి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ నగేశ్వర వాసవి కన్యకా పరమేశ్వరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలతో పాటు దీపోత్సవం,నందీశ్వర అభిషేకం, అర్ధ నారీశ్వరీ అన్నపూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పజ్జూరి గోపయ్య బుద్దా రమేశ్, మహంకాళి హరిశ్చంద్ర గుప్తా, పుల్లూరు శ్రీనివాస్, గంగిశెట్టి మంజునాథ్, గోపిశెట్టి శ్రీనివాస్, లగిశెట్టి వీరలింగం, వంగపల్లి చంద్రశేఖర్, నంగునురి లక్ష్మీనారాయణ, గోపిశెట్టి నాగరాజు పాల్గొన్నారు. బాలాజీనగర్ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో నీటికొలను ఏర్పాటు చేసి వాటిలో అరటి దొప్పల్లో దీపాలను వదిలి భక్తిని చాటుకున్నారు.
భక్తిశ్రద్ధలతో పోలిపాడ్యమి దీపారాధన
భక్తిశ్రద్ధలతో పోలిపాడ్యమి దీపారాధన


