వేటు పడింది
జనగామ: బచ్చన్నపేట పంచాయతీ కార్యదర్శులు చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో ఎంపీఓ వెంకట మల్లికార్జున్‌ను తాత్కాలికంగా నర్మెట మండలానికి డిప్యుటేషన్‌పై పోస్టింగ్ ఇస్తూ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘దందా ఎంపీఓ’లు.. ‘వేటా? బదిలా?’ శీర్షికలతో సాక్షిలో ప్రచురితమైన వరుస కథనాలకు కలెక్టర్ స్పందించారు. బచ్చన్నపేట ఎంపీఓ పంచాయతీ సెక్రెటరీలను ఇబ్బందులకు గురిచేస్తూ వసూళ్ల దందాపై ఈ నెల10వ తేదీన కలెక్టర్‌కు ఫిర్యాదు అందగా, 12వ తేదీన విచారణకు ఆదేశించారు. ఈ మేరకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఫిర్యాదు చేసిన సెక్రెటరీల వాంగ్మూలం తీసుకుని నివేదికను కలెక్టర్‌కు అందించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం విచారణ పెండింగ్ దశలో ఉండగా, ఆరోపణలను పరిగణలోకి తీసుకుని ఎంపీఓను నర్మెటకు బదిలీ చేశారు. విచారణ పూర్తయ్యేవరకు ఎంపీఓ వెంకట మల్లికార్జున్ నర్మెట మండలంలో పనిచేయాల్సి ఉంటుంది. ఈ మేరకు బచ్చన్నపేట ఎంపీడీఓ కార్యాలయం సూపరింటెండెంట్ కె.శ్రీనాథ్‌రెడ్డికి అదనపు చార్జి అప్పగించడంతో పాటు వెంటనే బాధ్యతలు స్వీకరించాలని ఆదేశాలు జారీ చేశారు.
చక్రం తిప్పింది ఎవరు..?
ఎంపీఓ మల్లికార్జున్‌ను సస్పెన్షన్‌కు గురికాకుండా కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు రంగంలోకి దిగి గండం నుంచి గట్టెక్కించిన్నట్లు చర్చ జరుగుతోంది. ఎంపీఓపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు రాగా, మరో ఎంపీఓ సైతం ఇన్సూరెన్స్ పాలసీలు, వేధింపులకు సంబంధించి ఆరోణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీనిపై ఎలాంటి విచారణ లేకపోవడం గమనార్హం.
బచ్చన్నపేట ఎంపీఓ బదిలీ
కొనసాగుతున్న విచారణ
నర్మెటకు పోస్టింగ్


