ప్రతీ మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలి
జనగామ రూరల్: ప్రతీ మహిళ పారిశ్రామిక వేత్తగా ఎదగాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకంపైన ఏపీఎం, సీసీ, మండల సమాఖ్య సభ్యులకు గురువారం కలెక్టరేట్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్థానికంగా తయారు చే సిన నిత్యం ప్రజలకు అవసరమైన వస్తువులు మహిళా సంఘాల సభ్యుల నుంచి వస్తే ప్రజలకు ఎక్కువ నమ్మకం ఉంటుందన్నారు. ఆహార ఉత్పత్తి ప్రాసెస్‌లో మహిళలకు పరికరాల కొనుగోలుకు సహకా రం అందించనున్నట్లు తెలిపారు. 200 వరకు వ్యక్తిగత ఆహార పరిశ్రమల లక్ష్యం ఉందని నాణ్యమైన ఉత్పత్తులు చేస్తే మార్కెటింగ్ కల్పిస్తామన్నారు. పరిశ్రమలు వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకుంటే ప్రాజెక్ట్ వ్యయంలో 35 శాతం సబ్సిడీ, రూ.10 లక్షల వరకు ప్రాజెక్ట్ వ్యయంపై రుణ అనుసంధాన రాయితీ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ వసంత, నూరుద్దీన్, జిల్లా అధికారులు ఉమాపతి, శ్రీరామ్, నవీన్, ఇక్రిశాట్ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. కేంద్రం నుంచి జల పురస్కారం అవార్డు అందుకున్న నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు కలెక్టర్, అదనపు కలెక్టర్లు, డీఆర్‌డీఓను సన్మానించారు.
పక్కాగా విజయోస్తు 2.0 అమలు చేయాలి
విజయోస్తు 2.0 కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి పింకేష్ కుమార్‌తో కలిసి మండల విద్యాశాఖ అధికారులు, వివిధ విద్యాసంస్థల యజ మాన్యాలతో గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు విద్యార్థులకు 100 శాతం ఎఫ్‌ఆర్‌ఎస్ అటెండెన్స్ ఉండాలన్నారు. యూడైస్ ప్లస్ పోర్టల్‌లో పాఠశాల వసతులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల సమాచారాన్ని నమోదు చేయాలన్నారు. అపార్ ఐడీలు 100 శాతం పూర్తయ్యేలా చూడలన్నా రు. అధికారులు తప్పనిసరిగా పాఠశాలలను విజి ట్ చేసి ఎస్‌ఏ వన్ పరీక్ష ఫలితాలను పరిశీలించాలన్నారు. పదో తరగతి పరీక్షల ప్రణాళికల ప్రకారం ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు పాటించా లని సూచించారు. న్యాస్ మాదిరిగానే ఈఏడాది మూడో తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి నెలలో నిర్వహించబోతున్న ఫౌండేషనల్ లెర్నింగ్ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్) కోసం మూడో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో ఏఈ సత్యప్రసాద్, ఏఎంఓ శ్రీనివాస్, జీసీడీఓ గౌసియా బేగం, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
జిల్లా ఆదర్శంగా నిలవాలి
ప్రధాన్ మంత్రి ధన్, ధాన్య కృషి యోజన పథకాన్ని సమన్వయంతో అమలు చేసి రైతులకు గరిష్టలాభం చేకూరేలా పని చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. పథకం అమలు పైన గురువారం కలెక్టరెట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రణాళిక రూపకల్పన, భవిష్యత్ లక్ష్యాల ఖరారుపై వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్, సహకార విభాగం, భూగర్భ జలాలు, పౌర సరఫరాల శాఖల అధికారులకు సూచనలు చేశారు. శాఖలవారీగా ప్రాజెక్టులను సిద్ధం చేసి రెండు రోజుల్లో సమర్పించాలన్నారు.
నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
దిక్సూచిలో భాగంగా విల్ 2 కాన్ సంస్థ సహకారంతో ఉపాధ్యాయులకు కొనసాగుతున్న 30 రోజుల స్పోకెన్ ఇంగ్లిష్, డ్రాఫ్టింగ్ నైపుణ్య శిక్షణను గురువారం కలెక్టర్ పరిశీలించారు. టెక్నాలజీకి అనుగుణంగా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలన్నారు. ప్రతి రోజు అన్ని పాఠశాలల్లో 30 నిమిషాల ప్రత్యేక దిక్సూచి పీరియడ్ నిర్వహించి విద్యార్థుల నైపుణ్యా లు పెంచాలన్నారు. ఉపాధ్యాయుల నైపుణ్యాలు మెరుగుపడాలనే ఉద్దేశంతో స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ రామేశ్వరం గౌడ్ సహకారంతో ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. 1,500 మంది ఉపాధ్యాయులతో కలెక్టర్ వర్చువల్‌గా మాట్లాడారు. శ్రీనివాస్, గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికలు సమర్థవంతంగా
నిర్వహించాలి
జనగామ: స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అధికారులకు సూ చించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి, ఎన్నికల సంఘం అధికారులతో కలిసి గురువారం ఆమె హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్లు, పంచాయతీ అధికారులతో స్థానిక ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా అభ్యంతరాలు, పోలింగ్ కేంద్రాలు, రిజర్వేషన్ల ప్రక్రియ, శాంతిభద్రతల అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యుల జాబితా సమర్పించాలని ఆదేశించారు. మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు కార్యచరణ రూపొందించాలన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్


