చదువుతోనే సమాజంలో గుర్తింపు
కొడకండ్ల: విద్యతోనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని, విద్యాభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని కస్తూరిబా పాఠశాలలో రూ.94 లక్షలతో నిర్మించే అదనపు గదుల నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి రూ.5 లక్షలతో పూర్తి చేసిన 7వ అంగన్‌వాడీ కేంద్ర నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్‌ఓ జ్యోతి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మౌలిక వసతులు కల్పించే బాధ్యత తనదని, శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకునే బాధ్యత విద్యార్థులదని సూచించారు. వెనుకబడిన కొడకండ్ల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. ఇంటిగ్రేటేడ్ స్కూల్‌తో కొడకండ్ల ఎడ్యూకేషనల్ హాబ్‌గా మారనుందని అన్నారు. తరగతి గదిలోకి వెళ్లి మాస్టారులా మారిన ఎమ్మెల్యే ప్రతి విద్యాద్ధి తమ భవిష్యత్ లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదువుకోవాలని సూచించారు. పాఠ్యాంశాలకు సంబంధించిన సందేహాలను వెంటనే నివృత్తి చేసుకొవాలని విద్యార్థులకు చెప్పారు. అదనంగా ఐదు బాత్రూంలు, గీజర్ వైరింగ్, హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయిస్తానని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ సాయికృష్ణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్, మండల అధికారులు, నాయకులు, మార్కెట్ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. కస్తూరిబా పాఠశాలలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి విద్యార్థుల వద్దకు వెళ్లి ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చారు.
విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం
పెద్దపీట
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి


