ముగిసిన కార్తీక మాసోత్సవం
జనగామ: ముప్పై రోజుల పాటు భక్తి శ్రద్ధలతో సాగిన కార్తీక మాసం గురువారంతో ముగిసింది. రోజు వారీగా ప్రత్యేక పూజలు, అభిషేకా లు, అర్చనలు, నంది అభిషేకాలు, దీపోత్సవం, రాత్రివేళ ఆకాశజ్యోతి దర్శనంతో భక్తులు శివయ్య అనుగ్రహాన్ని అందుకున్నారు. దేశంలోని పంచారామాలయాలతో సహా వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లి నదీ స్నానాలు, ప్రత్యేక అర్చనలు చేపట్టిన భక్తులు కఠిన నియమాలతో 30 రోజులపాటు పూజలు నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు. చివరి రోజున ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు చేసిన అనంతరం ఉసిరి చెట్టు వద్ద దీపాలు వెలిగించారు.
దీపాల వెలుగుల్లో శివనామ స్మరణ
గురువారం జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రతి ఇల్లు, దేవా లయాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. శివ నామస్మరణ, దీపారాధన, ఉపవాస దీక్షలు, మహాన్యాస పూర్వ క అభిషేకాలు నిర్వహించిన భక్తులు కార్తీక మాస ఉపవాస దీక్షలను ము గించారు. భక్తులకు ఆకాశజ్యోతి దర్శన భాగ్యం కల్పించగా, ఉసిరి చెట్టు కింద దీపారాధన చేశారు.
పోలీ స్వర్గానికి ఏర్పాట్లు
కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజు నేడు(శుక్రవారం) పోలీ స్వర్గం పర్వదినాన్ని భక్తులు ప్రత్యేకంగా జరుపుకుంటారు. తెల్లవారు జామునే నదీ ప్రవాహంలో దీపాలను వదలడం ఆనవాయితీ.. వీలు కాని భక్తులు ఆలయాల్లో వెలిగిస్తారు. నెల రోజులపాటు నియమాలు పాటించకపోయినా పోలీ పాడ్యమి రోజున కనీసం 30 వత్తులు వెలిగిస్తే విశేష పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. కార్తీక పర్వదినంతో ప్రారంభమైన భక్తి దీపార్చన పోలీ స్వర్గం రోజున మరింత భక్తి శ్రద్ధలతో సాగుతుంది.
ముప్పై రోజులపాటు
భక్తి శ్రద్ధలతో పూజలు
నేడు పోలి స్వర్గం


