రిటైర్డ్ రిజిస్ట్రార్ కె.కొండల్‌రెడ్డి
లింగాలఘణపురం: గ్రామీణ ప్రాంత ప్రజలు శాస్త్రీయ పద్ధతుల్లో పాడిపరిశ్రమను చేపడితే అభివృద్ధి సాధ్యమవుతుందని పశువైద్య విశ్వవిద్యాలయం రిటైర్డ్ రిజిస్ట్రార్ కె.కొండల్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని సిరిపురం రైతు వేదికలో వి.వి.నర్సింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, సేవా స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా శాసీ్త్రయ పద్ధతుల్లో డెయిరీ, పాల ఉత్పత్తుల జోడింపుపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్ ఎం.శశికుమార్, ప్రొఫెసర్ సాహిత్యారాణి, సేవాస్ఫూర్తి ఫౌండేషన్ ప్రాజెక్టు మేనేజర్ జి.రత్నాకర్, ఏఓ మమత, గిరిబాబు, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు.


