రామలింగేశ్వరుడికి అన్నపూజ
జనగామ: పట్టణంలోని పాతబీటు బజారు శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని బుధవారం అన్నపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అంతకుముందు స్వామికి అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ రామిని రాజేశ్వర్, ఉపాధ్యక్షుడు మహంకాళి హరిశ్చంద్రగుప్తా, ప్రధాన కార్యదర్శి కోకల మల్లేశం, కోశాధికారి అయిత శ్రీనివాసులు, సభ్యులు బాలాచారి, మారం శ్రీనివాస్, నాళ్ల మధు, పెద్ది శ్రీనివాస్, దారం సోమయ్య, వంగపల్లి చంద్రశేఖర్, ఆలయ అర్చకులు శివరాజ్ శర్మ పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు జశ్వంత్
రఘునాథపల్లి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్వహించిన జిల్లాస్థాయి వాలీబాల్ పోటీల్లో మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల విద్యార్థి కె.జశ్వంత్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం ఉపేందర్ తెలిపారు. ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–14 విభాగంలో జశ్వంత్ ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంపై జశ్వంత్‌ను బుధవారం పాఠశాలలో ఉపాధ్యాయులు అభినందించారు. కార్యక్రమంలో పీఈటీ కుమార్, నాగభూష ణం, సురేందర్, రాములు, రవీందర్, లావణ్య, శ్రీలత, రేణుక, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఆకాశ జ్యోతి దర్శనం
జనగామ: కార్తీకమాసం పురస్కరించుకుని పట్టణంలోని గుండ్లగడ్డ శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో బుధవారం భక్తులు ఆకాశ జ్యోతి దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు గంగు సాంబమూర్తిశర్మ ఆధ్వర్యంలో శివయ్యకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు ఉమ, రమ, హైమ, రాణి, పద్మ, ప్రమీల, సరిత, విజయ, వాణి, నాగమణి, ప్రకాశ్, రమేశ్, ప్రభాకర్, రాజు, శ్రీకాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కేయూ బీపీఈడీ కళాశాల ప్రిన్సిపాల్‌గా భాస్కర్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఆ విభాగం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.భాస్కర్‌ను నియమిస్తూ రిజిస్ట్రార్ రామచంద్రం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళా శాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహించగా.. ఆయన స్ధానంలో భాస్కర్‌ను నియమించారు. వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులను భాస్కర్‌కు అందజేశారు.
తొర్రూరు పీఏసీఎస్ పాలకవర్గం కొనసాగింపు
తొర్రూరు: తొర్రూరు పీఏసీఎస్ పాలకవర్గాన్ని తాత్కాలికంగా కొనసాగిస్తూ జిల్లా సహకార శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం డీసీఓ వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. రద్దు చేసిన పీఏసీఎస్ చైర్మన్, ఇతర డైరెక్టర్లు కొనసాగనున్నారు. రుణాల రికవరీలో నిర్లక్ష్యం, డైరెక్టర్లు రుణాలు తీసుకుని చెల్లించకపోవడం, ధాన్యం తరలింపు, గన్నీ సంచుల కొనుగోళ్లలో అవకతవకలు, బడ్జెట్ రూపకల్పనలో నిర్లక్ష్యం నేపథ్యంలో తొర్రూరు సొసైటీ పాలకవర్గాన్ని రద్దు చేస్తూ సెప్టెంబర్‌లో సహకార శాఖ ఉత్తర్వులు జారీ చేశారు.
రామలింగేశ్వరుడికి అన్నపూజ
రామలింగేశ్వరుడికి అన్నపూజ


