చీరల పంపిణీకి ఇన్‌చార్జులు
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ రూరల్: జిల్లాలో ఉన్న 11,237 స్వయం సహాయక సంఘాలలో 1,36,747 మంది సభ్యులు ఉన్నారని 1,15,143 మందికి ఇప్పటివరకు ఇందిరమ్మ చీరలు వచ్చాయని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ప్రతీ గ్రామంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను, ఇన్‌చార్జ్‌లను చార్జిలను పెట్టాలన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంపై బుధవారం సచివాలయం నుంచి కలెక్టర్లు, మహిళా సమాఖ్య సభ్యులతో సీఎం రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీసీలో అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, బెన్ షాలోమ్ పాల్గొన్నారు.
వృద్ధులతో స్నేహపూర్వకంగా ఉండాలి..
వృద్ధులతో స్నేహపూర్వకంగా ఉండి ప్రేమను పంచాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా పిలుపునిచ్చారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 1న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని శామీర్ పేటలోని రుద్రమదేవి ఓల్డ్ హోమ్ సేవ సొసైటీలో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె.కోదండరాములు, డీఆర్‌డీఏ జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్ సతీష్, కన్న పర్శరాములు,హేమలత, క్యాథరిన్, వెంకట మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు హెచ్‌ఎంల సంఘం సత్కారం
జనగామ: జల సంరక్షణలో జిల్లా జాతీయ స్థాయి సౌత్‌జోన్‌లో ద్వితీయ స్థానంలో నిలిచి కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న సందర్భంగా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాను హెచ్‌ఎంల సంఘం సత్కరించింది. ప్రధానోపాధ్యాయుల రాష్ట్ర కార్యదర్శి బుర్ర రమేశ్, హెచ్‌ఎంల బృందం లక్ష్మణ్‌గౌడ్, బీమా నాయక్, కిరణ్ కుమార్, అంజయ్య, ఈర్యా, కొండ శ్రీనివాస్ ఉన్నారు.


