విద్యారంగంలో రోల్‌మోడల్ తెలంగాణ
● స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్‌ఘన్‌పూర్: సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యమిస్తోందని, విద్యారంగంలో తెలంగాణ దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తోందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్‌పూర్ మండలంలోని నమిలిగొండ శివారు మోడల్‌స్కూల్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం ఎంపీ కడియం కావ్యతో కలిసి ఎమ్మెల్యే కడియం శంకుస్థాపన చేశారు. అనంతరం కేజీబీవీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.. నియోజకవర్గంలోని ఏడు కస్తూర్బా పాఠశాలలకు వసతుల కల్పనకు రూ.6 కోట్లు మంజూరయ్యాయని, ఘన్‌పూర్ కస్తూర్బా, మోడల్ స్కూల్‌కు రూ.28 లక్షలతో సీసీ రోడ్డు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. సమాజంలో మహిళలు అభివృద్ధి చెందినప్పుడే దేశ ప్రగతి సాధ్యమని ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. జిల్లా జీసీడీఓ ఎండీ గౌసియాబేగం, ఏఎంసీ చైర్‌పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మోడల్‌స్కూల్ ప్రిన్సిపాల్ వేణుగోపాల్‌రెడ్డి, కేజీబీవీ ఎస్‌ఓ రజిత, హెచ్‌ఎం సంపత్ పాల్గొన్నారు.
జఫర్‌గఢ్‌లో..
జఫర్‌గఢ్: మండల కేంద్రంలోని కస్తూర్బా, మోడల్ స్కూల్ సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కడి యం శ్రీహరి ఎంపీ కావ్యతో కలసి శంకుస్థాపన చేశారు. కస్తూర్బాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రిన్సిపాల్ సీహెచ్ స్వప్న అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథులుగా హాజరైన ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ.. కోనాయిచలంలో రూ.200కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ లావణ్యశిరీష్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కర్ణాకర్‌రావు, వైస్ చైర్మన్ ఐలయ్య, తహసీల్దార్ రాజేష్‌రెడ్డి, ఎంపీడీఓ సుమన్ పాల్గొన్నారు.


