ఆరోగ్య జనగామ లక్ష్యం
జనగామ: ఆరోగ్య జనగామగా చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నానని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నియోజకవర్గంలోని జనగామ అర్బన్, జనగామ మండలం, నర్మెట, తరిగొప్పుల, బచ్చన్నపేట మండలాలకు చెందిన 79 మంది లబ్ధిదారులకు రూ.23 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందించారు. ఇచ్చిన మాట ప్రకారం రెండు సంవత్సరాలుగా తన నీలిమా హాస్పిటల్‌లో నియోజకవర్గ ప్రజలందరికీ ఉచిత వైద్యం అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ గరిష్టంగా రూ.60వేలు మాత్రమే ఇస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 60శాతం డబ్బులను లబ్ధిదారులకు అందించామన్నారు. కార్యక్రమంలో ఇర్రి రమణారెడ్డి, పోకల జమున, బాల్దె సిద్ధిలింగం, మేకల కళింగరాజు, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, ఆయా మండలాల నాయకులు ఉన్నారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి


