విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి
జనగామ రూరల్: విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని రాష్ట్ర పరిశీలకురాలు, సీట్ అడిషనల్ డైరెక్టర్ విజయలక్ష్మి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి పింకేశ్‌కుమార్ ఆధ్వర్యంలో మండల విద్యాధికారుల సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న స్కూల్ ఆండ్ క్లిన్ స్పెషల్ క్యాంపెయిన్ 5.0పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాలలు శుభ్రంగా ఉన్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారని అన్నారు. విద్యాశాఖాధికారి పింకేశ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యాశాఖ ప్రతి మాసం విజయోస్తు కార్యక్రమం ద్వారా అన్ని అంశాలపై సమీక్ష చేస్తున్నామన్నారు.
వెల్దండ పాఠశాల సందర్శన..
నర్మెట: పాఠశాలలో తరగతి గదులను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు విద్యార్థులకు మానసికోల్లాసం కలిగించే విధంగా ఆహ్లాదకరంగా, పచ్చదనంతో ఉండాలని రాష్ట్ర పరిశీలకురాలు, సీట్ అడిషనల్ డైరెక్టర్ విజయలక్ష్మి సూచించారు. మండలంలోని వెల్దండ పాఠశాలను సందర్శించిన ఆమె ఎంఈఓ మడిపల్లి ఐలయ్యతో పాటు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సీఎంఓ నాగరాజు, ఉపాధ్యాయులు అంజిరెడ్డి, శామ్యూల్ ఆనంద్, తిరుమల్‌రెడ్డి, రమేష్, కృష్ణమూర్తి, బాలసిద్దులు, మాధవి, కల్పన పాల్గొన్నారు.
రాష్ట్ర పరిశీలకురాలు, సీట్ అడిషనల్ డైరెక్టర్ విజయలక్ష్మి


