రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు
జనగామ: అన్నదాతల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ పెట్టుబడి సాయం 21వ నిధులు బుధవారం విడుదలయ్యా యి. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించారు. పీఎం కిసాన్ ద్వారా ఏడాదికి మూడు విడతల్లో రూ.6వేల పెట్టుబడి సాయం రైతులకు అందుతోంది. జనగామ జిల్లాలో 1, 80వేల మంది రైతులు ఉండగా, పీఎం కిసాన్ నిబంధనల మేరకు 20వ విడత వరకు 51, 346 మంది రైతుల ఖాతాల్లో నిధులు జమయ్యాయి. మొదటి విడతలో 1,06,274 మంది రైతులకు నిధులు అందగా ఎనిమిదో విడత నుంచి రైతుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. తాజాగా 21వ విడత నగదు జమతో కొత్తగా అర్హత పొందిన వారి సంఖ్య మొత్తం పరిశీలన పూర్తయిన తర్వాత వెల్లడికానుంది.
పెట్టుబడి సాయం అందింది..
ఏటా మూడు సార్లు పీఎం కిసాన్ డబ్బులు నా ఖాతాలో జమ అవుతున్నాయి. నాలుగు ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. యాసంగి, వానాకాలం సీజన్‌లో పంటల సాగు సమయంలో పీఎం కిసాన్ సాయం ఎంతగానో అక్కరకు వస్తోంది.
– వెంకట్రాం కనకయ్య,
వీఎస్‌ఆర్ నగర్, బచ్చన్నపేట
రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు


