నవాబుపేట అంగడి వేలం ఆదాయం రూ.72.50 లక్షలు
లింగాలఘణపురం: మండలంలోని నవాబుపేట కోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రతీ శుక్రవారం జరిగే పశువుల సంతలో రహదారుల వేలం పాట ఆదాయం రూ.72.50 లక్షలు వచ్చినట్లు ఈఓ లక్ష్మిప్రసన్న తెలిపారు. బుధవారం హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన వేలం పాటలో నవాబుపేటకు చెందిన బూడిద సదానందం వేలం దక్కించున్నారని చెప్పారు. పలుమార్లు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వేలం నిర్వహించగా తగిన ఆదాయం రాకపోవడంతో చివరిగా హైదరాబాద్ కమిషనర్ కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్ నిఖిల్ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించామన్నారు. వేలం పాటలో రాజు, మహేందర్, నర్సింహులు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


