కాసులు కురిపిస్తున్న ఇసుక
రఘునాథపల్లి మండలంలో ఇసుకాసురుల తవ్వకాలతో వాగు పరిస్థితి
రఘునాథపల్లి: ఇందరమ్మ ఇళ్ల పథకం పేరిట ఇసుక దందా కొంతమంది నాయకులు, ట్రాక్టర్ యజమానులకు కాసులు కురిపిస్తున్నాయి. లబ్ధిదారుల కూపన్‌లతో ఒకటికి నాలుగు ట్రిప్పుల ఇసుక మాయం చేస్తున్నారు. ఇబ్రహీంపూర్, ఫతేషాపూర్, లక్ష్మీతండా, మాదారం, సోమయ్యకుంట తండా, రఘునాథపల్లి, దాసన్నగూడెం, ఖిలాషాపూర్, కంచనపల్లి, మేకలగట్టు గ్రామాల్లో ఒక్కో ట్రాక్టర్ రూ.4,500 నుంచి రూ.5వేల వరకు ప్రైవేటుగా విక్రయిస్తున్నారు.


