దందా ఆగేదెలా?
ఆకేరు వాగు
జఫర్‌గడ్: ఆకేరు వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఈ విషయంలో అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. కూనూరు, తిడుగు, ఉప్పుగల్లు గ్రామాల మీదుగా ఉన్న ఆకేరు వాగును గుల్లచేస్తున్నారు. ఇక్కడ నుంచి హన్మకొండ, కాజీపేట, మడికొండ పట్టణ ప్రాంతాలతో పాటు ఆయా గ్రామాలకు ఇసుకను తరలించి రూ.5వేల నుంచి రూ.7వేలు వసూలు చేస్తున్నారు.
జనగామ: జిల్లాలో వాల్టా, మైనింగ్, ఇరిగేషన్ చట్టాలు కళ్లముందే ఉల్లంఘిస్తున్నా, ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు ఎక్కడా కనిపించడం లేదు. ఇసుక అక్రమ రవాణా గత కొద్దికాలంగా పది రెట్లు పెరిగింది. ఇందిరమ్మ ఇళ్ల కోసం తక్కువ ధరకే ఇసుక అందించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని మాఫి యా స్వర్గధామంగా మార్చుకుంది. కొంతమంది చీకటి ఒప్పందాలతో పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇసుక దోపిడీ కొనసాగుతోంది. కొన్ని గ్రామాల్లో బలమైన నాయకుల ఆశీస్సులతో సిండికేట్‌గా ఇసుక వ్యాపారానికి తెరలేపినట్లు ప్రచారం ఉంది. సామాజిక కార్యకర్తలు, ప్రజలు అడ్డుకుంటున్నా ఇసుక అక్రమ వ్యాపారాన్ని సంబంధిత అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇసుక తరలింపునకు నెలనెలా మాముళ్లు ఎవరికనే అంశం జిల్లాలో పెద్ద చర్చకు దారితీస్తోంది. బచ్చన్నపేట, జనగామ–యశ్వంతాపూర్, రఘునాథపల్లి, దేవరుప్పుల, స్టేషన్‌ఘన్‌పూర్ వాగుల పరిధిలో గుంతలు బావులను తలపించే విధంగా మారిపోయాయి.
ఇందిరమ్మ ఇళ్ల పేరిట..
దేవరుప్పుల: ఇందిరమ్మ ఇళ్లకు ఉచితం పేరిట కలెక్టర్ స్థానిక అవసరాలకు తహసీల్దార్లకు ఇచ్చిన ఇసుక అనుమతులు మాఫియాకు ఊతం ఇచ్చినట్టవుతుంది. దాదాసాహెబ్‌కాలనీ నుంచి పాలకుర్తి, కొడకండ్ల మండలాల్లోని ఇళ్ల నిర్మాణం కోసం ఇసుక అనుమతులు తీసుకుని, ఇతర ప్రాంతాల్లో డంప్‌లు చేసి వ్యాపారం సాగిస్తున్నారు. ట్రాక్టర్‌కు రూ.4వేల నుంచి రూ.5వేల వరకూ అమ్ముకుంటున్నారు.
అంతా ప్రైవేటుకే
లింగాలఘణపురం: ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు అధిక ధరకు ఇసుక విక్రయించి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల అనుమతి ఉన్న వారికి ట్రాక్టర్‌కు రూ.3,500 ట్రిప్పు ఇస్తుండగా, ఇదే అ నుమతితో అక్రమంగా ఇసుక తరలించి రూ.5వేలకు విక్రయిస్తున్నారు.
జోరుగా రవాణా
పాలకుర్తిటౌన్: మండలానికి అవసరమైన ఇసుకను ముత్తారం, దేవరుప్పుల, జఫర్‌గడ్ కూనూరు, కోణాచలం, తిడుగు, వర్ధన్నపేట మండలం ఇల్లందు నుంచి అక్రమంగా పాలకుర్తి మండలానికి తరలిస్తున్నారు. ట్రాక్టర్‌కు రూ.5,000నుంచి రూ.8వేల వరకు విక్రయిస్తున్నారు.
మోతమోగుతున్న చప్పుళ్లు
స్టేషన్‌ఘన్‌పూర్: తాటికొండ గ్రామంలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఇసుక ట్రాక్టర్ల మోతతో ఊరి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. తాటికొండ, కొత్తపల్లిలోని వాగుల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు.
బచ్చన్నపేట: పోచన్నపేట వాగు నుంచి ఇసుక తరలింపు
ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక దోపిడీ
అధికారుల మౌనం..
మాఫియాకు వరం..?
అదుపుతప్పిన చీకటి వ్యాపారం
నెలనెలా మాముళ్లు..
వాల్టాచట్టానికి తూట్లు
ఒక్కో ట్రాక్టర్ రూ.4వేల నుంచి
రూ.8వేల వరకు వసూలు
రాత్రికి రాత్రే
బచ్చన్నపేట: మండలంలోని పోచన్నపేట, నక్కవానిగూడెం, కాశీనగర్ ఏరియా లోని వాగుల నుంచి ఇసుకను రాత్రికి రాత్రే సరిహద్దులను దాటించేస్తున్నారు. తరలించిన ఇసుకను రహస్య ప్రాంతాల్లో డంప్ చేసి, బయటికి గ్రామాలకు విక్రయిస్తున్నారు. ఒక్క కూపన్ చూపించి నాలుగు ట్రాక్టర్ల ఇసుకను అమ్ముకుంటున్నారు.
దందా ఆగేదెలా?
దందా ఆగేదెలా?


