‘జల్ సంచాయ్..’లో జిల్లా ద్వితీయ స్థానం
జనగామ రూరల్: జిల్లాలో జల సంరక్షణ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసినందుకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల్ సంచాయ్ జన్ భాగీధారీ కార్యక్రమంలో సౌత్ జోన్‌లో జిల్లా ద్వితీయ స్థానం సాధించింది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుతో పాటు రూ.కోటి నగదు ప్రోత్సాహాన్ని కేంద్రం ప్రకటించింది. ఈ సందర్భంగా కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ సెప్టెంబర్ 26న సంబంధిత ఉత్తర్వులను జారీ చేసింది. కాగా మంగళవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌న్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖమంత్రి సీఆర్ పాటిల్ చేతుల మీదుగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అవార్డు అందుకున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో జల్ సంచాయి జన భాగీధారి 2.0 కింద కలెక్టర్ రిజ్వాన్ బాషా జిల్లాలో ‘మన జిల్లా.. మన నీరు’ అనే నినాదంతో కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో తక్కువ ఖర్చుతో వర్షపు నీటి ఇంకుడు గుంత నిర్మాణాన్ని ప్రారంభించి జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులకు తగు సూచనలు చేస్తూ జిల్లాలోని ప్రతీ గ్రామ మండల, జిల్లా, స్థాయి అధికారులకు టార్గెట్ ఇచ్చారు. తక్కువ ఖర్చుతో వర్షపు నీటి సంరక్షణ గుంతలు ఇప్పటి వరకు 7,350 నిర్మాణం పూర్తి కాగా వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు సుమారు 50,000 వర్షపు నీటి సంరక్షణ గుంతలు నిర్మిచాలని కలెక్టర్ జిల్లాలోని అధికారులకు, సామాజిక సంస్థలకు, ప్రజలకు తెలిపారు. జిల్లాకు లభించిన ఈ జాతీయ స్థాయి గుర్తింపుపై అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వైభవంగా శ్రీసోమేశ్వర స్వామి మాస కల్యాణం
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మాస శివరాత్రి సందర్శంగా చండిక అమ్మవారి ఆలయంలో మంగళవారం చండికాసమేత శ్రీసోమేశ్వర స్వామివారి మాస కళ్యాణం మేళతాళాలు, అర్చకుల వేద మంత్రోచ్ఛరణల మధ్య వైభవోపేతంగా జరిగింది. భక్తులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొని కనులారా తిలకించి తరలించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ ప్రధాన అర్చకుడు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్ శర్మ,దేవగిరి అనిల్‌కుమార్, మత్తగజం నాగరాజు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
శివపార్వతుల కల్యాణం ..
జనగామ: కార్తీకమాసం పర్వదినం పురస్కరించుకుని జనగామ పట్టణంలోని గుండ్లగడ్డ శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో మంగళవారం శివపార్వతుల కల్యాణం, లక్షవత్తుల జ్యోతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆగమశాస్త్రం ప్రకారం అర్చకులు గంగు సాంబమూర్తి, వేదపండితుల వేదఘోషతో ప్రారంభమైన పుణ్యాహవాచనం, స్వస్తి వాచ నం, మహాగణపతి పూజ అనంతరం కంకణధారణ, ప్రత్యేక మంగళ స్నానాలు నిర్వహించారు. కార్యక్రమంలో రామిని శ్రీనివాస్, అనురాధ, రమా, ఉమా తదితరులు పాల్గొన్నారు.
నశాముక్త్ భారత్ అభియాన్ పోస్టర్ ఆవిష్కరణ
జనగామ రూరల్: మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నశాముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవం పురస్కరించుకుని కలెక్టరేట్‌లో మంగళవారం అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, బెన్‌షాలోమ్ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆఫీసు సిబ్బందితో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేసి అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో ప్రతిఒక్కరూ క్రియాశీల భాగస్వామి కావాలని డ్రగ్స్ రహిత జీవన శైలికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె. కోదండరాములు తదితరులు పాల్గొన్నారు.
‘జల్ సంచాయ్..’లో జిల్లా ద్వితీయ స్థానం
‘జల్ సంచాయ్..’లో జిల్లా ద్వితీయ స్థానం


