బుధవారం శ్రీ 19 శ్రీ నవంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
జనగామ వాగుల్లో ఇసుక దోపిడీ
జనగామ రూరల్: మండలంలోని యశ్వంతాపూర్, చీటకోడూరు వాగులు ఇటీవల కురిసిన వర్షాలతో ఇసుకతో నిండుకుండలా కనిపిస్తున్నాయి. వడ్లకొండ, గానుగుపహాడ్, ఎర్రగొల్లపహాడ్ తదితన ప్రాంతాల సరిహద్దుల్లో ఇసుక డంప్ చేస్తూ, ప్రైవేటుగా విక్రయాలు చేస్తున్నారు. యశ్వంతపూర్ వాగు నుంచి ఇందిరమ్మ ఇళ్లకు అనుమతి ఇవ్వగా, ఒక్క చీటికి నాలుగు ఇసుక ట్రాక్టర్లను అక్రమంగా అమ్ముకుంటున్నారు. మైనింగ్, రెవెన్యూ అధికారులు పట్టించుకుని భూగర్భ జలాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
తనిఖీలు చేస్తున్నా..
ఆగని దందా


