కాంట్రాక్టర్లకు చేపల పెంపకం అప్
● స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
రఘునాథపల్లి: చెరువులు, రిజర్వాయర్లలో చేపలు పట్టి విక్రయించే బాధ్యతలు కాంట్రాక్టర్లకు అప్పగించి నష్ఠపోవద్దని ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. మంగళవారం మండలంలోని అశ్వరావుపల్లి రిజర్వాయర్‌లో ఆయన చేపపిల్లలను వదిలారు. ఈ సందర్బంగా జిల్లా మత్య్స పారిశ్రామిక సొసైటీ జిల్లా అధ్యక్షుడు నీల రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. చేపల పెంపకం, విక్రయ బాధ్యతలు కాంట్రాక్టర్లకు అప్పగించడం వల్ల మత్య్సకారులు ఆర్దికంగా నష్టపోతారన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, ఆర్‌డీఓ గోపిరాం, డీఎఫ్‌ఓ రాణాప్రతాప్ పాల్గొన్నారు.
పెద్ద సైజు చేపపిల్లలు వేయాలి
లింగాలఘణపురం: రిజర్వాయర్‌లలో పెద్ద సైజు చేపపిల్లలు వేయాలని, అప్పుడే మత్స్యకారులకు ప్రయోజనం కలుగుతుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని నవాబుపేట రిజర్వాయర్‌లో చేప పిల్లలను విడుదల వేశారు.
శ్రీరామనవమి వరకు పనులు పూర్తిచేయాలి
రాబోయే శ్రీరామనవమి వరకు నవాబుపేట కోదండరామస్వామి ఆలయంలో కల్యాణ మండపం, సీసీ పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే కడియం సూచించారు. డీపీఓ నవీన్, డీఎఫ్‌ఓ రాణాప్రతాప్, ఆర్డీఓ గోపిరామ్, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ శివశంకర్‌రెడ్డి పాల్గొన్నారు.


