మహిళా గ్రూపుల పనితీరుపై పరిశీలన
లింగాలఘణపురం: మండల కేంద్రంలోని శుభాంజలి మండల సమాఖ్య, సరస్వతి గ్రామైక్య సంఘాల్లోని గ్రూపు సభ్యుల పనితీరుపై మంగళవారం ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్లు తేజశ్వని, వెంకటరమణ పరిశీలించారు. సరస్వతి గ్రామైక్య సంఘం సమావేశానికి హాజరై సంఘంలోని సభ్యులు తీసుకున్న రుణాలు, వాటితో ఉపాధి పొందుతున్న విధానం, తిరిగి రుణాలు చెల్లిస్తున్న తీరు, భవిష్యత్తులో మరింత ఉన్నతంగా అభివృద్ధి సాధించేందుకు తీసుకుంటున్న చర్యలపై సంఘ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వీరితో పాటు అదనపు డీఆర్‌డీఓ నూరుద్ధీన్, మండల సమాఖ్య అధ్యక్షురాలు కాటం రవ్య, ఉమ, పద్మ, రేణుక తదితరులు ఉన్నారు.


