గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి
జనగామ: యువత, నిరుద్యోగులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఆడిట్ అధికారి రెహమాన్ అన్నారు. సోమవారం 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా జిల్లా గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలుగా ఉపయోగపడుతున్నాయన్నారు. ఇక్కడ పెంపొందించుకున్న జ్ఞానం భవిష్యత్‌లో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రాంబాబు, నాయకులు లింగాల జగదీష్, చందర్‌రెడ్డి, తోటకూరి రమేష్, బంద కుమార్, సంస్థ కార్యదర్శి సుధీర్, పుల్లయ్య, కళా నిలయం వ్యవస్థాపకుడు రాజేంద్ర ప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్: నూతనంగా ఏర్పడిన ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య సమస్యపై ప్రత్యేక చొరవతో పనిచేస్తున్నామని, అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ఘన్‌పూర్ ఎస్సీ కాలనీ 16వ వార్డులో సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న డ్రెయినేజీ సమస్యను పరిష్కరించారని కాలనీవాసులు కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.కమిషనర్ స్పందిస్తూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశాల మేరకు కలెక్టర్ రిజ్వాన్‌బాషా, అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ సూచనలతో పనిచేయడం జరిగిందన్నారు. అభివృద్దికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మోటం శ్రీనివాస్, పొదల రవి తదితరులు పాల్గొన్నారు.
జనగామ రూరల్: వృద్ధులతో ప్రతిఒక్కరూ ఆప్యాయంగా, ప్రేమగా ఉండాలని ఇన్‌చార్జ్ జిల్లా సంక్షేమాధికారి కోదండ రాములు అన్నారు. సోమవారం మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వయోవృద్ధుల వారోత్సవాల సందర్భంగా పట్టణంలోని ర్రుమదేవి వృద్ధ ఆశ్రమంలో చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు క్యాథరిన్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సిద్ది మల్లయ్య, మల్లారెడ్డి, రామస్వామి, రాజయ్య, భిక్షపతి, రామచంద్రం సీడీపీఓ సత్యవతి, స్వాతి, రాజు, తదితరులు పాల్గొన్నారు.
జనగామ: భాగ్యనగర్ టీఎన్‌జీఓ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీలో ఉద్యోగులకు స్థలాలను కేటాయించాలని టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు ఖాజా షరీఫ్ కోరారు. సోమవారం హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన నిరసన దీక్షలకు జిల్లా నుంచి టీఎన్‌జీఓ నాయకులు, సభ్యులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. అనంతనం ఖాజా మా ట్లాడుతూ హౌసింగ్ సొసైటీ కేటాయించిన 140 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు నెలలక్రితం 20 ఎకరాలు కబ్జా చేసినట్లు తెలిపారు. ఈ విషయమై తామంతా 125 రోజులుగా నిరసన చేస్తున్నామన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 48 రోజుల పాటు సకల జనుల సమ్మెతో ఉద్యోగులు ముఖ్యభూమిక పోషించారన్నారు. స్థలాన్ని కబ్జా చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట జిల్లాకు చెందిన పలువురు నాయకులు ఉన్నారు.
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి


