పెన్షన్లు.. భూ సమస్యలు
ప్రజావాణిలో వినతుల వెల్లువ
● జనగామ పట్టణం స్వర్ణ కళామందిర్ పక్కన గల తన స్థలాన్ని కొందరు కూరగాయల వ్యాపారులు దౌర్జన్యంగా ఆక్రమించి వ్యాపారం నిర్వహిస్తున్నారని శ్రీహరి అనే వ్యక్తి విన్నవించారు.
● రాజీవ్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్న మోతే సంధ్య అద్దె ఇంట్లో ఇబ్బందులు పడుతున్నామని ఇందిరమ్మ ఇల్లు ఇప్పించి ఆదుకోవలని దరఖాస్తు చేసుకుంది.
● ఇందిరమ్మ ఇల్లు తన భార్య రాజేశ్వరీ పేరు మీద మార్చాలని జఫర్‌గఢ్ మండలం రేగడి తండాకు చెందిన భూక్య రవి వేడుకున్నారు.
● వితంతు పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని చీటకోడూరుకు చెందిన తుక్కపల్లి ఎల్లమ్మ విన్నవించింది.
ఈ ఫొటోలోని దివ్యాంగుడు చాగల్లు గ్రామానికి చెందిన తాటికాయల కుమార్. పుట్టుకతోనే కుడి చేయి పడిపోయింది. ఎలాంటి పనులు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఐదేళ్ల క్రితం సదరం సర్టిఫికెట్ వచ్చింది. దివ్యాంగ పెన్షన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసినా.. రావడం లేదని, పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని గ్రీవెన్స్‌లో విన్నవించారు.
●
జనగామ రూరల్: సదరం సర్టిఫికెట్ ఉన్నా.. దివ్యాంగ పింఛన్ రావడం లేదని, సాగు భూమి ఒక గ్రామానికి బదులు మరొక గ్రామంలో ఉందని, కళాకారుల పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని, ధాన్యం కొనుగోలు చేయడం లేదని.. ఇలా పలు సమస్యలతో సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణిలో వినతులు సమర్పించారు. అదనపు కలెక్టర్‌లు పింకేష్ కుమార్, బెన్‌షాలోమ్‌లు అర్జీలను స్వీకరించి ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. పెండింగ్ దరఖాస్తులు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, ఆర్డీఓ గోపిరామ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి
అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్
గ్రీవెన్స్‌లో 39 అర్జీలు
పెన్షన్లు.. భూ సమస్యలు


