చాళుక్యుల దీపస్తంభానికి దీపారాధన
రఘునాథపల్లి: మండలంలోని నిడిగొండ శివాలయం సమీపంలోని కల్యాణి చాళుక్యుల కాలం నాటి జైనమాన దీప స్తంభానికి కార్తీక మాసం సందర్భంగా సోమవారం రాత్రి గ్రామస్తులు దీపారాధన చేశారు. యువకులు, మహిళలు, చిన్నారులు, భక్తులు కలిసి ఎత్తైన స్తంభానికి దీపారాధన చేయడంతో నాటి వైభవం విరాజిల్లింది.
పాఠశాల ఆకస్మిక తనిఖీ
స్టేషన్‌ఘన్‌పూర్: మండలంలోని రాఘవాపూర్ ప్రభుత్వ పాథమికోన్నత పాఠశాలను స్పెషల్ క్యాంపెయిన్ 5.0 రాష్ట్ర పరిశీలకులు, ఎన్‌ఈఆర్‌టీ డైరెక్టర్ విజయలక్ష్మి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్పెషల్ క్యాంపెయిన్ 5.0లో భాగంగా పాఠశాల ఆవరణ, తరగతి గదులు, వంటగది, మూత్రశాలలు, పరిశుభ్రత, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. ప్రభుత్వం, విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా చేపడతుఉన్న స్పెషల్ క్యాంపెయిన్ కార్యక్రమాలను సజావుగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీఎంఓ నాగరాజు, ఎంఈఓ కొమురయ్య, హెచ్‌ఎం అనిల్, ఎమ్మార్సీ సిబ్బంది గిరి, లవన్, రమేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
చాళుక్యుల దీపస్తంభానికి దీపారాధన


