అధిక సాంద్రత పత్తి సాగు లాభదాయకం
రఘునాథపల్లి: అధిక సాంద్రత పత్తి సాగు లాభదాయకమని రాష్ట్ర రైతు విజ్ఞాన కేంద్ర ప్రధాన శాస్త్రవేత్త, సమన్వయ కర్త డాక్టర్ శ్రీలత అన్నారు. సోమవారం మండలంలోని కన్నాయపల్లిలో యాదాద్రి భువనగిరి తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అధిక సాంద్రత పత్తి సాగు విధానంపై శేరి సోమిరెడ్డి పత్తి చేనులో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీలత మాట్లాడుతూ ఎకరాకు 9 నుంచి 13 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఎకరాకు రూ.5 వేలు రైతుల ఖాతాలో జమ చేస్తుందన్నారు. అనంతరం గ్రామంలోని 50 మంది రైతులకు షెడ్యూల్ కులాల ఉప ప్రణాళికలో భాగంగా ఉచితంగా డీహెచ్‌ఎం 117 రకం మొక్కజొన్న విత్తనాలు పంపణీ చేశారు. కార్యక్రమంలో ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి. మల్లయ్య, సుశీల, ఏఓ కాకి శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌ఈసీ సభ్యుడు మంతపురి యాదగిరి, ఏఈఓ కల్పన, వేణు, రూప, రాజేష్, బానుచందర్, రెతులు పాల్గొన్నారు.


