ముగిసిన జీడికల్ జాతర
లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయంలో ఈనెల 4న మొదలైన జాతర సోమవారంతో ముగిసింది. చివరిరోజు వేదపండితులు ఆలయంలో అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. 108 కలశాలతో మహాసంప్రోక్షణ చేశారు. అనంతరం పండితోపన్యాసం, మహాదాశీర్వచనంతో ఉత్సవం పరిసమాప్తి జరిగింది. కార్యక్రమంలో వేదపండితులు గట్టు శ్రీనివాసాచార్యులు, విజయసారథి, భార్గవాచార్యులు, రాఘవాచార్యులు, మురళీధరాచార్యులు, బుచ్చయ్యశర్మ, దేవస్థాన చైర్మన్ మూర్తి, ఈఓ వంశీ, దేవస్థాన డైరెక్టర్లు, రిటైర్డ్ ఈఓ కేకే రాములు, సిబ్బంది భరత్, మల్లేశం, రమేష్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


