జీడికల్‌లో ఘనంగా చక్రస్నానం
లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయంలో ఆదివారం ఘనంగా చక్రస్నానం కార్యక్రమం జరిగింది. సీతారాముల కల్యాణోత్సవ అనంతరం జరిగే తంతులో భాగంగా వేదపండితులు శ్రీనివాచార్యులు వేదమంత్రోచ్ఛరణలతో ఉత్సవ విగ్రహాలను జీడిగుండం, పాలగుండాల్లో చక్రస్నానం చేయించారు. కార్యక్రమంలో వేదపండితులు భార్గవాచార్యులు, మురళీధరాచార్యులు, దేవస్థాన చైర్మన్ మూర్తి, డైరెక్టర్లు, దేవస్థాన సిబ్బంది భరత్, మల్లేశం, రమేశ్, రి టైర్డ్ ఈఓ కేకే రాములు, భక్తులు పాల్గొన్నారు.
ఘనంగా శ్రీసరస్వతి యజ్ఞం
పాలకుర్తి టౌన్ : ప్రముఖ చండీత సమేత సో మేశ్వర లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రం ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సత్రంలో 511వ శ్రీసరస్వతి యజ్ఞం నిర్వహించారు. 33 ఏళ్లుగా నెలకొక యజ్ఞం చొప్పున అనేక ప్రాంతాల్లో 510 సరస్వతి యజ్ఞాలు పూర్తి చేసుకుంది. కార్యక్రమంలో అష్టకాల విద్యా మనోహర శర్మ, భక్తులు పాల్గొన్నారు.
ముగిసిన పవిత్రోత్సవాలు
స్టేషన్‌ఘన్‌పూర్ : డివిజన్ కేంద్రంలోని తిరుమలనాథస్వామి ఆలయంలో పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు ఆదివారం ముగిశాయి. మూడ్రోజులుగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల చివరి రోజు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కలకోట రంగాచార్యులు, ప్రధాన అర్చకులు రామానుజచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారికి 108 కలశాలతో విశేష అభిషేకం చేశారు. మధ్యాహ్నం మహాపూర్ణాహుతి, ఆలయశుద్ధి, వేద పండితుల సన్మానం, భక్తులకు ఆశీర్వచనం కార్యక్రమాలను చేపట్టారు. కార్యక్రమంలో పూజారులు రఘునాథచార్యులు, విష్ణువర్ధనాచార్యులు, గోపాలకృష్ణమా చార్యులు, శ్రీవత్సవాజీవణా చార్యులు, భక్తులు పాల్గొన్నారు.
పత్తి కొనుగోలుకు ఆంక్షలు సరికాదు
జఫర్‌గఢ్ : ఎలాంటి ఆంక్షలు లేకుండా సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాపర్తి సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆ పార్టీ శాఖ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి చిర్ర కుమారస్వామి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా సోమయ్య హాజరై మాట్లాడారు. పత్తి కొనుగోళ్లలో సీసీఐ ఆంక్షలు విధించడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ టౌన్ కార్యదర్శి కాట సుధాకర్, నాయకులు సాకి నర్సింగం, వెంకటేష్, అప్సర్, కుమారస్వామి, ఖాదర్, సుధాకర్, బాషబోయిన అనిల్, నల్లతీగల శ్రీను పాల్గొన్నారు.
21 నుంచి స్పోకెన్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్ తరగతులు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్ (సెల్ట్) ఆధ్వర్యంలో 40 రోజులపాటు స్పోకెన్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్సు తరగతులు ఈనెల 21 నుంచి నిర్వహించనున్నట్లు సెల్ట్ డైరెక్టర్ డాక్టర్ మేఘనరావు తెలిపారు. ఈతరగతులు ఇంగ్లిష్ విభాగంలోని సెల్ట్ కార్యాలయంలో సాయంత్రం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న క్యాంపస్ విద్యార్థులు రూ.200, ఉద్యోగులు, నిరుద్యోగులు, గృహిణులు రూ.1,500లు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రిన్సిపాల్ కార్యాలయంలో నాన్ యూనివర్సిటీ ఫండ్ అకౌంట్‌లో ఈనెల 20లోపు చెల్లించి కోర్సులో చేరవచ్చని పేర్కొన్నారు. ఈనెల 21 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు.
జీడికల్‌లో ఘనంగా చక్రస్నానం
జీడికల్‌లో ఘనంగా చక్రస్నానం
జీడికల్‌లో ఘనంగా చక్రస్నానం


