భక్తిశ్రద్ధలతో కార్తీక దీపోత్సవం
రఘునాథపల్లి: మండలంలోని నిడిగొండలో శిథి లావస్థలో ఉన్న ముప్పేశ్వర త్రికూటాలయంలో ఆదివారం కార్తీక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. చుట్టు పక్కల గ్రామస్తులు తరలివచ్చి కార్తీ క దీపాలను వెలిగించి దైవభక్తిని చాటుకున్నారు.
కుంకుమార్చన..
కార్తీక మాసం సందర్భంగా మండలంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో పండితులు అభిషేకాలు, కుంకుమార్చన పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీవాసవీ మాతా సేవా సమితి ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ లగిశెట్టి భిక్షపతి–రాజమణి దంపతులను ఘనంగా సత్కరించారు. ప్రతినిఽధి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
శివాలయంలో..
దేవరుప్పుల: కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో పూజారి పెద్దాపురం వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకం, పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు శివలింగానికి క్షీరాభిషేకం చేసి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు.
భక్తిశ్రద్ధలతో కార్తీక దీపోత్సవం


