దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగిస్తాం
బచ్చన్నపేట: తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగిస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. ఆదివారం మండలంలోని చిన్నరామన్‌చర్ల గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ క్యామ మల్లేశంతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. దొరల పెత్తందారీ వ్యవస్థకు ఎదురొడ్డిన దొడ్డి కొమురయ్య అమరుడయ్యాడన్నారు. ఆ స్పూర్తితోనే అనేక పోరాటాలను చేశారని, ప్రపంచ చరిత్రలో సాయుధ పోరాటం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై పెట్టాలని సీఎంతో మాట్లాడానని, ఆయన జయంతి, వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా సీఎం చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో విగ్రహ దాత కేమిడి రాజు, కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెవెళ్ల సంపత్, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి, కళాకారుల సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి ఒగ్గు రవి, మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నింటి కావ్యశ్రీరెడ్డి, నాయకులు బాల్నె సిద్దిలింగం, కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి, బేజాడి బీరప్ప, బండి వీరస్వామి, నర్సింహులు, సిద్దులు, కిష్టయ్య, రమణారెడ్డి, మల్లేశం పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య


