వైభవంగా కార్తీక దీపారాధన | - | Sakshi
Sakshi News home page

వైభవంగా కార్తీక దీపారాధన

Nov 16 2025 10:21 AM | Updated on Nov 16 2025 10:21 AM

వైభవం

వైభవంగా కార్తీక దీపారాధన

అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

పాలకుర్తి టౌన్‌: కార్తీక మాసోత్సవంలో భాగంగా శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం రాత్రి కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. చండికా అమ్మవారి ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించారు. మహిళలకు తాంబూలం, ప్రసాదం వాయినంగా అర్చకులు మత్తగజం నాగరాజు అందజేశారు.

నేడు ‘తెలంగాణ రాష్ట్రం–

విద్యావ్యవస్థ’ అంశంపై చర్చ

జనగామ: రాష్ట్రంలోని విద్యారంగ పరిస్థితిపై ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించేందుకు తెలంగాణ జాగృతి టీచర్స్‌ ఫెడరేషన్‌(టీజేటీఎఫ్‌) ఆధ్వర్యంలో ఈనెల 16న (ఆదివారం) ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని డ్రీమ్‌ స్కేప్‌ హోటల్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ‘తెలంగాణ రాష్ట్రం –విద్యావ్యవస్థ’ అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నట్లు తెలంగాణ జాగృతి టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్ర రమేశ్‌, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోరం వీరభద్రరావు, జాడి శ్రీనివాస్‌ శని వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సదస్సుకు జాగృతి అధ్యక్షురాలు కల్వ కుంట్ల కవిత ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారని తెలిపారు.

విద్యుత్‌ ఉపకేంద్రం

నిర్మాణాలకు స్థలపరిశీలన

చిల్పూరు: మండలంలోని లింగంపల్లి, నష్కల్‌ గ్రామాల్లో నూతనంగా నిర్మించబోయే 33/11 కేవీ విద్యుత్‌ ఉప కేంద్రాల నిర్మాణాలకు శనివా రం స్టేషన్‌ఘన్‌పూర్‌ ట్రాన్స్‌కో డీఈ వై.రాంబాబు స్థల పరిశీలన చేశారు. ఈసందర్భంగా చిల్పూరు ఏఈ లక్ష్మినారాయణ, సివిల్‌ ఏడీ హుస్సేన్‌, సివిల్‌ ఏఈ రాజ్‌కుమార్‌తో కలిసి మాట్లాడుతూ.. గ్రామాల్లో లో ఓల్టేజీ నివారణ కోసం సబ్‌స్టేషన్‌ల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. ప్రస్తుతం కొండాపూర్‌ గ్రామంలో చేపట్టిన నిర్మాణ పనులు త్వరలో పూర్తి అవుతాయని తెలిపారు. కార్యక్రమంలో లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ నీలం ఐలేష్‌, లైన్‌మన్‌ కృష్ణంరాజు, అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ అశోక్‌, కట్టర్‌ సురేష్‌, నాయకులు గొడుగు రవి, ఏదునూరి రవీందర్‌, కంకటి రాజన్న, కండ్లకోలు శ్రీనివాస్‌, తుత్తురు రాజు, కర్ణకంటి వెంకటేష్‌ పాల్గొన్నారు.

జిల్లాస్ధాయి కబడ్డీ పోటీల్లో ద్వితీయ స్థానం

పాలకుర్తి టౌన్‌: బాలల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో వాస్మిక్‌ ఫౌండేషన్‌ నిర్వహించన అండర్‌–17 జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా స్ధాయిలో ద్వితీయ స్థానంలో నిలిచినట్లు పాఠశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ మామిండ్ల సోంమల్లు శనివారం తెలిపా రు. కబడ్డీ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌, సీబీఐ మాజీ డైరెక్టర్‌ జేడీ లక్ష్మీనారాయణ బహుమతి ప్రదానం చేసినట్లు పేర్కొన్నారు. ఈసందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పాయం శోభారా ణి, ఉపాధ్యాయులు ఓరుగంటి రమేశ్‌, గుగులోతు బలరాం, బైకాని వెంకన్న, రవి, సుమత, శోభ, మాలతి విద్యార్థులను అభినందించారు.

జనగామ రూరల్‌: సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పాదయాత్ర అధికారుల నిర్లక్ష్యంతో అస్తవ్యస్తంగా నిర్వహించారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్‌ ఆరోపించారు. శనివారం అదనపు కలెక్టర్‌ పింకేశ్‌ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పెద్దఎత్తున చేపట్టాల్సిన పాదయాత్రను కనీసం రెండు కిలోమీటర్లు కూడా నిర్వహించలేకపోయారని, అధికారులు చివరివరకు ఉండక తూతూ మంత్రంగా జరిపించారని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్రకార్యవర్గ సభ్యులు లేగ రామ్మోహన్‌రెడ్డి, ఉడుగుల రమేశ్‌, కన్వీనర్‌ అంకుగారి శశిధర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు తోకల ఉమారాణి, భాగాల నవీన్‌రెడ్డి, అంజి రెడ్డి, ఉపాధ్యక్షులు దేవర ఎల్లయ్య, కోకన్వీనర్‌ రమేశ్‌, వడ్లకొండ రవి తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా కార్తీక దీపారాధన1
1/2

వైభవంగా కార్తీక దీపారాధన

వైభవంగా కార్తీక దీపారాధన2
2/2

వైభవంగా కార్తీక దీపారాధన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement